భారత్.. గుజరాత్ లో గల  స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం ),  ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ఇది. ఈ విగ్రహం ఎత్తు: 182 మీటర్లు

చైనాలో గల స్ప్రింగ్‌ టెంపుల్‌ బుద్ధ స్టాచ్యూ , ఈ విగ్రహం ఎత్తు: 128 మీటర్లు ,  విగ్రహం సమీపాన ఉన్న నీటిలో ఔషద గుణాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు.

మైన్మార్‌ లో గల లాక్యూన్‌ సెక్యూ బుద్ధ , ఎత్తు: 115.8 మీటర్లు  ,   విగ్రహం తయారీకి 20 ఏళ్ల పట్టిందని అంటారు.

జపాన్ లో  ఉషికూ గ్రేట్‌ బుద్ధ , ఈ విగ్రహం ఎత్తు: 100 మీటర్లు  ,1993 తయారు.. అప్పటినుంచి 9 సంవత్సరాల వరకు ప్రపంచంలో పెద్ద విగ్రహంగా పేరు పొందింది.

జపాన్ లోని   సిటీ స్కేప్‌ ఆఫ్‌ డాయ్‌కెనాన్‌, ఈ విగ్రహం ఎత్తు: 100 మీటర్లు ,అయితే ఈ విగ్రహాన్ని నిశితంగా పరిశిలీస్తే.. విగ్రహం నగరం మధ్య భాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది.

చైనాలో గల గియషన్‌ గోనియన్‌ , ఎత్తు: 99 మీటర్లు , విగ్రహానికి వంద చేతులు, వంద కళ్లు ..కిరీటం మాత్రం బంగారంతో తయారు చేశారు.

థాయ్ లాండ్ గల  బిగ్‌ బుద్ధ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ , ఈ విగ్రహం  ఎత్తు: 92 మీటర్లు , దీని ప్రత్యేకత ఏంటంటే.. మొత్తం విగ్రహం బంగారు వర్ణంలో ఉంటుంది.

జపాన్ లోని డాయ్‌ కెనాన్‌ ఆఫ్‌ కీటో నో మియాకో పార్క్‌,  ఎత్తు: 88 మీటర్లు , విగ్రహంపై నుంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది