మనల్ని వేధించే గుండె సంబంధిత సమస్యల్లో గుండెదడ ఒకటి. ఈ ప్రాబ్లమ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి.

భయమైన వాటిని చూసినా, ఒత్తిడికి గురైనా సరే ఆందోళగా అనిపిస్తుంది. దీంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది.

ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకున్నా సరే గుండెదడ వచ్చే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది. కాఫీ ఎక్కువ తాగేవారికి కూడా ఇలా జరగొచ్చు.

కాఫీలోని కెఫిన్, మన గుండె వేగాన్నిపెంచుతుంది. కాబట్టి కాఫీ ఎక్కువగా తాగేవారు ఈ సమస్య బారిన పడే ఛాన్సుంది.

జ్వరం వచ్చినప్పుడు, శరీరంలో థైరాయిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, రక్తహీనతతో సమస్య ఉన్నాసరే గుండె దడదడమని కొట్టేసుకుంటుంది.

రక్తం తక్కువగా ఉండటం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో గుండె వేగంగా కొట్టుకుని బాడీకి ఆక్సిజన్ అందజేస్తుంది.

గుండెదడ తగ్గడానికి మందులు వాడటం, ఆల్కాహాల్ తక్కువగా తీసుకోవడం, కాఫీకి దూరంగా ఉండటం చేయాలి

తద్వారా థైరాయిడ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. రక్తహీనత  మందులు వాడటం వల్ల కూడా గుండెదడ తగ్గించుకోవచ్చు.

కొందరిలో గుండెదడతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దాన్ని ప్రమాదంగా భావించాలి. హార్ట్ బీట్ లో హెచ్చుతగ్గులు వచ్చినా సరే డేంజర్ గానే భావించాలి.

గుండెదడతో పాటు కొందరికి ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. అలాంటి వారు గుండెదడని తేలిగ్గా తీసుకోవద్దు.

గుండెదడ రావడం వల్ల కొందరు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

కొన్ని టిప్స్ పాటించడం వల్ల గుండె కొట్టుకునే వేగాన్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు కూడా.

స్వరపేటికకు ఎడమవైపు మైదడుకు రక్తాన్ని సరఫరా చేసి రక్తనాళం ఉంటుంది. దీనిపై స్మూత్ గా మర్దన చేయడంవల్ల గుండెదడ తగ్గించుకోవచ్చు.

కళ్లు మూసుకుని, వాటిపై చేతులు ఉంచి సున్నితంగా మర్దన చేసినా సరే గుండెదడ తగ్గించుకోవచ్చు.

నోట్: పైన టిప్స్ పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుడిని కూడా సంప్రదించండి.