లేత కొబ్బరి కంటే ఎండు కొబ్బరిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి.

ఎండు కొబ్బరిలో సెలీనియం, ఫైబర్, మాంగనీస్, కాపర్‌ పుష్కలంగా ఉంటాయి.

కొబ్బరి ఉండే ప్రోటీన్ల కారణంగా మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కొబ్బరి మెదడులో మైలీన్‌ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది.

పక్షవాతం, మతి మరుపు సమస్యలనుంచి పరిష్కారం దొరుకుతుంది.

ఎండుకొబ్బరిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇనుము వల్ల రక్తం బాగా త‌యార‌వుతుంది.

కీళ్ల నొప్పులు, ఎముకలు పెలుసుబారిపోవడం వంటి సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు ఒక ముక్క కొబ్బరి తినాలి.

కొబ్బరి తినటం వల్ల మల బద్దకం, అల్సర్‌, హెమ రాయిడ్స్‌ వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

ఎండు కొబ్బరిలోని పలు యాసిడ్స్‌ రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.

ఎండు కొబ్బరి కారణంగా గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.