బొప్పాయి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వీటిలో ఎన్నో పోషకాలతో పాటు ఔషద గుణాలు కూడా ఉన్నాయి. 

అయితే బొప్పాయి పండ్లు మాత్రమే కాక.. ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వచ్చిన సమయంలో రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోతుంది. 

సాధారణంగా మన రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 1,50,000 నుండి 4,50,000 వ‌ర‌కు ఉంటుంది. 

అయితే మన శరీరంలోకి డెంగ్యూ వైర‌స్ ప్రవేశిస్తే.. ప్లేట్‌లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుంది.

ఇలా జరిగినప్పుడు.. రోజుకు రెండుసార్లు బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.

ఈ ఆకుల్లో ఉండే ఎంజైమ్‌లు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య‌ను పెంచ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

బొప్పాయి ఆకుల‌ను చెట్టు నుంచి తెంపిన తర్వాత.. వాటిని శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత ఈ ఆకుల‌కు కొద్దిగా నీటిని క‌లిపి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని శుభ్రని వస్త్రంలో వేసి పిండుతూ రసం తీయాలి.

ఇలా వచ్చిన ఈ ర‌సానికి కొద్దిగా తేనెను క‌లిపి తీసుకోవాలి. 

ఇలా తేనె క‌లిపిన బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెర‌గ‌డంతోపాటు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

బొప్పాయి ఆకుల్లో ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌రల్స్‌తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి.

త‌ర‌చుగా ఈ రసాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఈ ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరిగి వ్యాధుల బారిన ప‌డకుండా ఉంటాం.

మరీ ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు త‌ర‌చూ బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది క‌దా అని దీనిని ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. 

బొప్పాయి ఆకుల ర‌సాన్ని ఎక్కువ‌గా తీసుకుంటే వాంతులు, విరేచ‌నాలు, త‌ల‌తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

తగిన మోతాదులో తీసుకొంటే ఎన్నో లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.