శరీరం నుంచి చెమటలు వచ్చినప్పుడే మనం ఆరోగ్యం బాగున్నట్లు అని నిపుణులు చెబుతుంటారు.

చెమట బయటకెళ్లిపోతేనే శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. బాడీలోని విషపదార్థాలన్నీ కూడా చెమట ద్వారానే పోతాయి.

జిమ్ చేసినప్పుడు, పరుగెత్తినప్పుడు, ఎండల్లో ఉన్నప్పుడు బాగా చెమట పడుతుంది.

కొందరికి మాత్రం వణికించే చలిలోనూ చెమటలు పడుతుంటాయి.

దానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, కొన్ని వ్యాధులకూ ఇది సిగ్నల్ అట.

చలికాలంలో ఎక్కువ చెమట.. శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ని ప్రభావితం చేస్తుంది.

శీతాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం రక్తపోటుకు కూడా సంకేతం కావొచ్చు. గుండెపోటు కూడా వచ్చే అవకాశముంది.

బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉండటానికి చెమట పడుతుంది.

కానీ అరచేతులు, పాదాల్లో విపరీతంగా చెమట పడితే మాత్రం హైపర్ హైడ్రోసిస్ తో బాధపడుతున్నారని అర్థం.

శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువైనా, తక్కువైనా మనకు ప్రాబ్లమే. ఇలా జరిగినప్పుడు కూడా చెమట ఎక్కువగా పడుతుంది.

చలికాలంలో మహిళలకు ఎక్కువగా చెమట పట్టినట్లు అనిపిస్తే.. పీరియడ్స్ ప్రారంభమయ్యాయని అర్థం. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఇలా జరిగే ఛాన్సుంది.

ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారికి కూడా చలికాలంలో చెమట ఎక్కువగా పడుతుంది.

నోట్: పైన చెప్పినవి మాకు అందుబాటులో ఉన్న ఆధారంగా రాశాం. ఆ విషయం గమనించగలరు.