సూర్యకుమార్ యాదవ్.. గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రపంచం జపం చేస్తున్న పేరు.
దానికి కారణం టీ20 ప్రపంచ కప్ లో బౌలర్లపై అతడి ఊచకోతే.
ఈ క్రమంలోనే సూర్యకుమార్ ను ఓపెనర్ గా బరిలోకి దింపాలని చూస్తోంది టీమిండియా.
భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి.
టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా, వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు.
ఇక ఈ సిరీస్ కు భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నారు.
దాంతో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్, మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భీకర ఫామ్ లో ఉన్న SKY ఓపెనర్ గా వస్తే.. మళ్లీ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మెరుపులు చూడొచ్చని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
టీ20లో జట్టులో చోటు దక్కించుకున్న శుబ్ మన్ గిలోతో పాటు ఓపెనర్ గా సూర్యకుమార్ బరిలోకి దిగితే బౌలర్లకు చుక్కలే.
ఓపెనర్ గా దిగడం సూర్యకు ఇది తొలిసారికాదు. ఈ ఏడాది వెస్టిండీస్ సిరీస్ లో రోహిత్ జోడిగా బరిలోకి దిగి పర్వాలేదనిపించాడు.
సూర్య కుమార్ ఓపెనర్ గా దిగితే పవర్ ప్లేలో తన మార్క్ షాట్స్ తో భారీగా పరుగులు సాధించగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.