ఇటీవల ఓటీటీలో విడుదలైన జైభీమ్ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

1993 కాలంలో దళిత, ఆదివాసిలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి చిత్ర వధకు గురి చేసిన వాస్తవాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.

ఈ సినిమాపై అటు సినిమా రంగానికి చెందిన వారే కాకుండా ఇతర రాంగాల వారు కూడా సినిమాను ప్రశంసిస్తున్నారు.

ఈ సినిమాలో భర్త రాజకన్న భార్య పార్వతి అమ్మాళ్ కి భర్త చేయని తప్పుకు ఎంతో శిక్షను విధిస్తారు.

1993 లో కస్టడీలో చంపబడిన భర్త రాజకన్నకు న్యాయం జరగాలంటూ భార్య పార్వతి అమ్మాళ్ చేసిన న్యాయపోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జ్ఞానవేల్. 

వాస్తవానికి రియల్ కథలో చంపబడిన భర్త రాజకన్న భార్య పార్వతి అమ్మళ్ కు కోర్టులో న్యాయం దక్కినా ఇప్పటికీ కూడా ఆమె ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. 

కోర్టు తీర్పు ప్రకారం ఇల్లును కట్టించినా అప్పట్లో వచ్చిన వరదల్లో అది కూడా దక్కకుండా పోయింది.

అప్పటి నుంచి పార్వతి అమ్మళ్ ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటూ బతుకును ఈడుస్తూ ఉంది.

జైభీమ్ సినిమాలో హీరోగా నటించిన సూర్య, పార్వతి అమ్మళ్ పరిస్థితి అర్థం చేసుకున్నాడు.

 ఇక హీరో సూర్య వెంటనే తన వంతుగా పార్వతి అమ్మళ్ కు సాయం చేయాలని భావించాడు.

పార్వతికి రూ. 10 లక్షల నగదును ఆమె పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి తన ధాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.

దీనిపై వచ్చే నెల నెల వడ్డీ అంతా పార్వతికి వెళ్తుందని ఆ తర్వాత ఆమె పిల్లలకు అందజేస్తానని సూర్య తెలిపారు.

ఇక సూర్యతో పాటు డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ కూడా పార్వతికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. 

ఇక తాజాగా హీరో సూర్య చేసిన ఇంతటి సాయానికి నెటిజన్స్ అంతా హ్యాట్సాప్ చెబుతున్నారు.