మారిన ఆహారపు అలవాట్ల కారణంగా నేటి కాలం యువత నోటికి ఏది రుచిగా అనిపిస్తే అది తినేస్తున్నారు.
దీని కారణంగా కిడ్నీల్లో విషపూరితమైన పదార్థాలు చేరి చివరికి అనారోగ్య పాలవుతున్నారు.
కిడ్నీలు ఇలా పాడవకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నిపుణుల సూచలను ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జంక్ ఫుడ్, నూనెల వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మూత్ర పిండాల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి.
మరీ ముఖ్యంగా మసాల ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ లు, మద్యపానం సేవించేవారి కిడ్నీలు త్వరగా పాడైపోతాయి.
తద్వారా జుట్టు, చర్మంతో పాటు ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
కిడ్నీలు చేడిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చ పండు గింజలతో తయారు చేసిన టీని తాగడం ద్వారా కిడ్నీలు శుభ్రంగా చేసుకోవచ్చు.
దీంతో పాటు మొక్క జొన్న కంకిలో ఉండే పీచును ఎండబెట్టి ఆ తర్వాత దాంతో టీ తయారు చేసుకుని తాగాలి. అలా తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి.
నెలకు ఒకటి రెండు సార్లు ఇలా మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
దీంతో పాటు జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, మసాల ఫుడ్ ను కూడా తీసుకోవడం మానేయాలి. ఇలా చేసినట్లైతే మీ కిడ్నీలు ఆరోగ్యం, శుభ్రంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.