కొందరు పుట్టుక అసాధారణమైనది. కొందరు జీవితం అసామాన్యమైనది. 

అలాంటి గొప్ప వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు.

మాస్ హీరోగా, క్లాస్ హీరోగా, సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు అనిర్వచనీయం.

సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోకూడదని తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇచ్చే సాంప్రదాయానికి పునాది వేసింది మన సూపర్ స్టార్ కృష్ణనే.

తెలుగు సినిమాకి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు కృష్ణ. టాలీవుడ్ లో మొదటి కౌ బాయ్, జేమ్స్ బాండ్ సినిమాలు తీసిన ఏకైక హీరో మన సూపర్ స్టారే.

తెలుగు నాట అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారో తెలియని వారికి.. కృష్ణలానే ఉంటారేమో అనేంత గొప్పగా ఆ పాత్రలో జీవించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ.

 సూపర్ స్టార్ సినిమాల్లో అడుగుపెట్టేముందు మీడియాకి, ప్రేక్షకులకు ఒక పరిచయ లేఖ రాసుకొచ్చారు. ఆ లేఖలో ఇలా రాసి ఉంది.

“రసిక ప్రపంచానికి నా వందనాలు. నా పేరు కృష్ణ. ‘తేనెమనసులు’ చిత్రంలో నా పేరు బసవరాజు.

సినిమాలో నటించాలన్న ఆశతో ఎన్నాళ్ళ నుంచో లెఫ్ట్ రైట్ కొడుతూ కలగంటున్న నాకు ఇన్నాళ్ళకి అది రంగురంగుల కలగా ఈస్ట్ మన్ కలర్ లో నిజమైంది.

కానీ దాని కోసం దర్శకులు, డాన్సు డైరెక్టరు నా చేత మూడు మాసాల పాటు అక్షరాలా డ్రిల్లు చేయించారు. తరవాత నటన నేర్పారు. డాన్సు నేర్పారు.

చివరకి నా వేషం ఏవిటండీ అంటే డ్రిల్లు మేష్టరేనన్నారు. నటన మాత్రం డ్రిల్లులాగే రాకుండా జాగ్రత్తగా శ్రద్ధగా పని చేశాననుకోండి.

మీరందరూ చూసి బాగోగులు చెప్పే క్షణం కోసం ఆశతో, ఆరాటంతో ఎదురుచూస్తున్నాను. 

ఉగాదికి నా శుభాకాంక్షలు. ఇట్లు.. కృష్ణ. 27.03.65 అంటూ ఈ లేఖలో రాసుకొచ్చారు.