టెక్ టాపిక్

ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మొబైల్ ఫోన్ కూడా మనలో ఓ భాగమైపోయింది.

టెక్ టాపిక్

పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి పొద్దుపోయి కునుకుతీసే దాకా చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే.

టెక్ టాపిక్

ఇప్పుడు నెలల పిల్లల నుంచే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మాయలో పడిపోతున్నారు. కొందరికైతే ఈ ఫోన్లు లేకుంటే పూట కూడా గడవని పరిస్థితి.

టెక్ టాపిక్

మరి.. అలాంటి సందర్భాల్లో మీ మొబైల్‌ లో డేటా కచ్చితంగా ఉండాలి. అన్ని టెలికాం కంపెనీలు డైలీ  డేటా యూసేజ్‌ లిమిట్‌ ని పెట్టాయి.

టెక్ టాపిక్

అంటే రోజులో 1 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ ఇలాంటి లిమిటెడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

టెక్ టాపిక్

ఆ డేటా అయిపోతే మళ్లీ వాళ్లే డైలీ డేటా టాపప్‌ అని డేటాని అమ్ముతున్నాయి. ఆ ప్లాన్లు కూడా తక్కువలో ఏం లేవులెండి. డైలీ 1.5 జీబీ డేటా కోసం వందల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.

టెక్ టాపిక్

అయితే అలాంటి పరిస్థితికి బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ చెక్‌ పెడుతోంది. కేవలం 398 రూపాయలకే డైలీ అన్‌ లిమిటెడ్‌ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

టెక్ టాపిక్

అన్‌ లిమిటెడ్‌ అంటే మీకు ఎలాంటి షరతులు, పరిధులు ఏం ఉండవు.

టెక్ టాపిక్

రోజులో ఎన్ని సినిమాలు అయినా చూడచ్చు, ఎన్ని వీడియోలు అయినా నిరంతరాయంగా ఎలాంటి అదనపు రీఛార్జ్‌ లు లేకుండా చూసేయచ్చు.

టెక్ టాపిక్

ఈ ప్లాన్‌ లో రూ.398తో 30 రోజుల పాటు అన్‌ లిమిటెడ్‌ డేటా, వాయిస్‌ కాలింగ్ కూడా పొందవచ్చు.

టెక్ టాపిక్

2021 సంవత్సరంలో టెలికాంరంగంలో ప్రిపెయిడ్ టారిఫ్‌ లను ఏమాత్రం పెంచని ఏకైక సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.

టెక్ టాపిక్

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంత మంచి ఆఫర్ ఇచ్చినా కూడా వినియోగదారుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడానికి ప్రధాన కారణం..

టెక్ టాపిక్

4జీ నెట్‌వర్క్‌ లేకపోవడమే. మరో ఇబ్బంది ఏంటంటే.. ఈ సంస్థకు ప్రధాన నగరాల్లో సైతం సరైన నెట్‌వర్క్‌ లేకపోవడం.

టెక్ టాపిక్

అయితే ఇప్పుడు అలాంటి అండ్డంకులను అధిగమించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది.

టెక్ టాపిక్

2022 సంవత్సరం చివరినాటికి 4జీ, 2023 సంవత్సరం చివరినాటికి 5జీ నెట్‌వర్క్ లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

టెక్ టాపిక్

అదే జరిగి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీ నెట్‌వర్క్‌ లను లాంచ్‌ చేయగలిగితే..

టెక్ టాపిక్

టెలికాంరంగంలో ఆ సంస్థకు పూర్వవైభవం దక్కుతుందనడంలో సందేహం లేదు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ అన్‌ లిమిటెడ్ డేటా ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.