ప్రస్తుతం అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య హార్మోన్ల అసమతుల్యత.

డైటింగ్‌ పేరు చెప్ప కడుపు మాడ్చుకోవడం.. ఆరోగ్యాన్ని కలిగించే ఆహారానికి దూరంగా ఉండటం వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి వారి కోసం బెస్ట్‌ ఆప్షన్‌.. పొద్దు తిరుగుడు గింజలు అంటున్నారు పౌష్టికాహారా నిపుణులు.

పొద్దు తిరుగుడు గింజల్లో ఎక్కువ మోతాదులో విటమిన్‌ ఇ, సెలెనియం ఉంటాయి. ఇవి చర్మ కణాలను రిపేర్‌ చేయడంలో సాయపడతాయి.

విటమిన్‌ ఇలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి.. వృద్ధాప్య ఛాయల్ని దరి చేరనీయవు. అతేకాక చర్మానికి మంచి పోషణ అందించి మెరిసేలా చేస్తాయి.

ఈ విత్తనాల్లో 100 భిన్న రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి హార్మోన్లలో అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. 

గర్భిణుల్లో కనిపించే థైరాయిడ్‌, మార్నింగ్‌ సిక్‌నెస్‌ వంటి వాటినీ దూరంగా ఉంచుతాయి.

అంతేకాక పుట్టబోయే పిల్లల్లో మెదడు, వెన్నుముక సమస్యలు రాకుండా కాపాడతాయట. అలానే వీటిల్లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనత రాకుండా చూస్తుంది.

ఇక ప్రస్తుతం చాలా మంది వేళకు తినకపోవడం, ఒకవేళ తిన్నా.. జంక్‌ ఫుడ్‌నే తీసుకుంటున్నారు. 

ఫలితంగా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలా జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల చెడు కొలెస్టరాల్‌ కూడా పెరుగుతుంది. 

అందుకే పొద్దు తిరుగుడు గింజలు తీసుకోవడం వల్ల ఇవి చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి. ఎక్కువ సేపు కడుపునిండినట్లుగా అనిపించి త్వరగా ఆకలి కానివ్వవు.

శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. వీటిల్లోని మెగ్నీయిషయం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

పొద్దుతిరుగుడు గింజల్లో ఫ్లవనాయిడ్స్‌ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి రోగ నిరోధకతను పెంచి.. త్వరగా జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి.

వీటిల్లో ఉండే యాంటీ డయాబెటిక్‌, కార్సినోజెనిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. మధుమేహం, రక్తపోటు, అల్జీమర్స్‌ బారిన పడకుండా కాపాడతాయి.

వీటిల్లో ఉండే మెగ్నీషియం జీర్ణ ప్రక్రియతో పాటు మెదడు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకొండి అంటున్నారు నిపుణులు.