షుగర్ పెషెంట్లు బియ్యం, గోధుమల తీసుకోవడం తగ్గించాలని ఐసీఎంఆర్ కొత్త అధ్యాయనం వెల్లడించింది.

వాటికి బదులు ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం పెంచాలని ఈ అధ్యయనం వెల్లడించింది. 

డయాబెటీస్ కేర్ జర్నల్ లో ప్రచురించబడిన కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం

కొత్తగా నిర్దారణ అయిన డయాబెటీస్ పెషెంట్లు 55 శాతం కార్బ్ వినియోగాన్ని తగ్గించాలట.

అలాగే 25 ప్రోటీన్ ను, 25 శాతం కొవ్వును పెంచాలని సూచిస్తోంది. 

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలోనే 70 శాతం కంటే ఎక్కువే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 

కాబట్టి పిండి పదార్థాలను తగ్గించి ప్రోటీన్ల శాతాన్ని పెంచాలని మధుమేహులకు సూచిస్తోంది. 

షుగర్ వ్యాధిని నియంత్రించాలంటే తెల్లబియ్యం వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు

షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి రెడ్ మీట్ కూడా మంచిది కాదు.

వాటికి బదులుగా చేపలు, చికెన్, మొక్కల ప్రోటీన్ ను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.

మధుమేహం వల్ల వ్యాస్కులర్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

2021లో చేసిన ఒక పరిశోధన అధ్యయనం ప్రకారం..టైప్ 2 డయాబెటీస్ వల్ల మాక్రోవాస్కులర్ వ్యాధి వస్తుంది. 

మధుమేహం మానసిక ఆరోగ్యం, కాలేయ వ్యాధి, వైకల్యం, క్యాన్సర్ వంటి ప్రమాదాలతో ముడి పడి ఉందని వెల్లడించాయి. 

కాబట్టి గోధుమలు, బియ్యంను దూరం పెట్టడం వలన షుగర్ లెవల్స్ ను అదుపులో పెట్టుకోవచ్చు.