ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య ఏదైనా ఉందా అంటే అది ఒకటే చర్మ సమస్య.

ముఖంపై మొటిమలు, దురదలు, స్కిన్ ఎలర్జీ వంటి అనేక చర్మ సమస్యలతో బాధపడుతుంటారు.

ఇలాంటి చర్మ సమస్యలను చెక్ పెట్టేందుకు చాలా మంది తమకు తోచిన రీతిలో ప్రయోగాలు చేస్తుంటారు. 

ఆకులు, అలములే కాకుండా మార్కెట్ లో దొరికే ఎన్నో రకాలు మందులు వాడుతూ చివరికి ఏరికోరి మరిన్ని చర్మ సమస్యలు తెచ్చుకుంటున్నారు. 

ఇలాంటి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రధానంగా ఈ రోజుల్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా అందంగా కనిపించేందుకు చేయని ప్రయత్నాలు లేవు.

మార్కెట్ లో ఏది కొత్తది కనపడితే అది వాడి మరిన్ని చర్మ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. 

ముఖంపై మొటిమలు ఉంటే మెత్తని గుడ్డలో ఐస్ ముక్కలను వేసి ఆ గుడ్డతో ముఖంపై రుద్దాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

 ప్రయాణంలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ముఖంపై తాజా దనం పూర్తిగా తొలిగిపోతుంది. 

అలాంటప్పుడు ఐస్ ముక్కలను ముఖంపై రుద్దితే కాంతి వంతంగా మురుతుందట.

అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటే ఆ ప్లేస్ లో నొప్పిగా అనిపిస్తుంది. అలా నొప్పి రాకుండా ఉండాలంటే ఐబ్రోస్ చేసుకునే ముందు ఐస్ ముక్కలతో ఐబ్రోస్ పైన రుద్దాలి. అలా రుద్దితే నొప్పి అనిపించదు.

కొందరి కళ్ల కింద చర్మం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ ఐస్ క్యూబ్ ను రాస్తే చర్మం యదాస్థితికి వస్తుంది.

మన చర్మం బిగుతుగా ఉన్నట్టుగా అనిపించిస్తే ఐస్ తో రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుందట.

ఇలాంటి ఎన్నో రకాల చర్మలు సమస్యలు వేధిస్తే గనుక ఐస్ ముక్కలతో కొంతైన చెక్ పెట్టేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.