అందంగా కనిపించేందుకు నేటి కాలం యువత ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

మాములుగా ముఖానికి ఒత్తుగా గడ్డం ఉండే వ్యక్తులు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తారు. 

కానీ ఈ రోజుల్లో చాలా మంది యువకులు గడ్డం పెరగకపోవడం సమస్యతో బాధపడుతుంటారు.

గడ్డం పెరిగేందుకు మార్కెట్ లో దొరికే ఎన్నో రకాలైన క్రిములు, రసాయనాలు వాడుతుంటారు.

అయినా ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. 

అయితే ఇలా గడ్డం పెరగడం లేదని బాధపడుతున్నారా?  అయితే ఈ చిట్కా పాటించండి.

ఒక గిన్నెలో టీ స్పూన్ కలబంద గుజ్జును తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి కలపాలి. 

అలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కడిగిన ముఖానికి గడ్డం వచ్చే ప్లేస్ లో రాయాలి.

అలా 10 నుంచి 15 నిమిషాల పాటు మర్దన చేసి గంట లేదా రెండు గంటల పాటు కడగకుండా అలాగే ఉంచాలి. 

ముఖంపై అంతా డ్రై  అయ్యాక గోరు వెచ్చని నీరు లేదా చల్లటి నీటితోనైన కడగాలి. 

ఇలా కాకుండా రాత్రి పూట పడుకునే ముందు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని గడ్డం వచ్చే చోట రాసుకోవాలి. 

ఉదయం నిద్రలేచిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. 

ఇలా తరుచు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.