వంటలలో ఉపయోగించే మసాలాల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి.

దాల్చిన చెక్క వంటలకు మంచి రుచిని ఇవ్వటమే కాదు! మన ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది.

దాల్చిన చెక్క పొట్ట దగ్గర కొవ్వును తగ్గించటంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

దీని పొడిని వేడి నీటిలో వేసుకుని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

అధిక ఆకలితో బరువు పెరుగుతున్న వారికి కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.

షుగర్‌ను కంట్రోల్‌ చేయటంలోనూ ఉపయోగపడుతుంది.

అజీర్తి సమస్యలతో బాధపడేవారికి, కడుపుబ్బరంతో బాధపడేవారికి దాల్చిన చెక్క దివ్య ఔషధం.

దీని పొడిని సొంటి, యాలుకలు, సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే ఈ సమస్యలు దూరం అవుతాయి.

పొడపత్రి, నల్ల జీలకర్ర, దాల్చిన చెక్క, పసుపు సమానంగా కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతుంది.

గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.