5 గ్రాముల క‌ర‌క్కాయ పొడిని బెల్లంతో క‌లిపి భోజ‌నానికి గంట ముందు తింటూ ఉంటే ర‌క్త మొల‌లు నశిస్తాయి.

కరక్కాయ పొడిని 3గ్రాములు తీసుకుని, దానికి టీ స్పూన్ తేనె క‌లిపి తింటే వాంతులు త‌గ్గుతాయి.

 అజీర్తి, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి కరక్కాయ చక్కటి ఔషదంలా పని చేస్తుంది.

 60 గ్రాముల క‌ర‌క్కాయ పొడి, 30 గ్రాముల పిప్ప‌ళ్ల పొడి, 10 గ్రాముల దాల్చిన చెక్క పొడి, 5 గ్రాముల ఇంగువ పొడిని క‌లిపి దోర‌గా వేయించి పెట్టుకోవాలి.

దాన్ని పూట‌కు 3 గ్రాముల చొప్పున రెండు పూట‌లు భోజ‌నానికి అర గంట ముందు తీసుకుంటూ ఉండాలి.

ఇలా చేయటం వల్ల ఆక‌లి వృద్ధి చెందుతుంది. తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణం అవుతుంది.

క‌ర‌క్కాయ పొడిని నాటు ఆవు నెయ్యి తో క‌లిపి రెండు పూట‌లా 3 గ్రామలు తీసుకుంటే శ‌రీరం దృఢంగా అవుతుంది.

క‌ర‌క్కాయ బెర‌డును నూరి ఒంటికి పట్టించుకోవాలి. 

అది ఆరిన తర్వాత స్నానం చేస్తూ ఉంటే అతి చెమ‌ట స‌మ‌స్యనుంచి విముక్తి లభిస్తుంది.

20 గ్రాముల క‌ర‌క్కాయ బెర‌డు పొడిని, 50 గ్రాముల ధ‌నియాల పొడిని, 70 గ్రాముల ప‌టిక బెల్లాన్ని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.

 ఆ మిశ్రమాన్ని టీ స్పూన్‌ మేర ఒక గ్లాస్ మంచి నీటితో భోజ‌నం త‌రువాత తాగాలి. 

ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉంటే మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది.

మాన‌సిక అనారోగ్యాలు తగ్గుతాయి. ఇలా చేయటం వల్ల ప్రతి రోజూ ఉద‌యం సుఖ విరోచ‌నం గ్యారంటీ.

 గ‌ర్భిణీ స్త్రీలు కరక్కాయకు వీలైనంత దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.