నిమ్మకాయలు, దాని రసంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషద గుణాలు కూడా ఉన్నాయి.

దీన్ని తీసుకోవడం ద్వారా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఇక నిమ్మకాయలే కాదు నిమ్మ ఆకుల్లోనూ ఎన్నో ఔషద గుణాలు దాగి ఉన్నాయి.

నిమ్మ ఆకుల్లోని విటమిన్ సీ.. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. అందుకే మెడిసన్ తయారీలో నిమ్మ ఆకులని ఎక్కువగా ఉపయోగిస్తారు.

తలనొప్పితో బాధపడుతున్న వారు.. నిమ్మ ఆకుల వాసన చూడటం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ కూడా తగ్గుతుంది.

నరాల సంబంధిత వ్యాధులు, నిద్రలేైమి, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడంలోనూ నిమ్మ ఆకులు ఎంతగానే ఉపయోగపడతాయి.

ఓ గిన్నెలో గ్లాస్ నీటిని వేడి చేయండి. అందులో శుభ్రంగా కడిగిన 10 నిమ్మ ఆకులను వేసి 10 నిమిషాలు బాగా మరిగించండి. ఇలా చేస్తే నిమ్మ ఆకుల టీ రెడీ అవుతుంది.

ఇలా తయారు చేసిన నిమ్మ ఆకుల టీని ఉదయం, సాయంత్రం ఒక్కో కప్పు తాగండి. దీని వల్ల మైగ్రేన్, డిప్రెషన్ లాంటివి తగ్గుతాయట.

ఇదే టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుందట. మూత్రపిండాల్లో రాళ్లు, శ్వాసకోస వ్యాధులు లాంటివి నయం అవుతాయి. దగ్గు, జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయి.

వీటితో పాటు కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు, కండరాల్లో తిమ్మిర్లు లాంటి చాలా అనారోగ్య సమస్యల్ని నిమ్మ ఆకుల టీ నయం చేస్తుంది.

ఈ ఆకుల్లోని సిట్రిక్ యాసిడ్.. మన పొట్టలోని క్రిముల్ని నశింపజేస్తుంది. నిమ్మ ఆకుల నుంచి తీసిన రసంలో తేనెని కలిపి తీసుకోవాలి. ఈ చిట్కా 5-10 రోజులు పాటిస్తే నులిపురుగులు నశిస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారు నిమ్మ ఆకుల టీ తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ టీని రెండు పూటలా తాగితే ఉబ్బసం తగ్గుతుంది.

నిమ్మ ఆకులు, లవంగాలు మెత్తగా నూరి.. ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న పన్నుపై ఉంచితే.. పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ ఆకులు, ఉప్పు కలిసి మెత్తగా నూరాలి. దానిలో బేకింగ్ సోడా కలిపి దంతాలు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లు తెల్లగా మారడం సహా నోటి దుర్వాసన లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

మలబద్దకం, అజీర్తితో బాధపడేవారు నిమ్మ ఆకులతో చేసిన టీని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గడానికి నిమ్మ ఆకులు పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

'మేం చెప్పిన సలహాలు పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి'.