గుమ్మడికాయలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. కానీ దీన్ని తినడానికి ఎవరూ ఇష్టపడరు.
గుమ్మడికాయ కొంచెం తియ్యగా ఉంటుంది. అయితే కొందరు మాత్రం పసుపు కలర్ గుమ్మడికాయలని తింటుంటారు.
కానీ తెల్ల గుమ్మడికాయలు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఇది తినడం వల్ల మీ శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడటం సహా కళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది.
తెల్ల గుమ్మడి కాయల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ6, విటమిన్ సీ, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.
మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలేట్, థయామిన్ లాంటి ఖనిజాలు ఇందులో ఉంటాయి.
తెల్ల గుమ్మడికాయల్లో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడానికి సహాయపడతాయి.
దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
ట్రిప్టోఫాన్ లోపించడం వల్ల డిప్రెషన్ సమస్య వస్తుంది. తెల్ల గుమ్మడికాయల్లో ఎల్-ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన అమైనో యాసిడ్.
దీన్ని మన శరీరం సొంతంగా తయారుచేయలేదు. తెల్ల గుమ్మడికాయ తీసుకోవడం వల్ల నిరాశతోపాటు డిప్రెషన్ కూడా తగ్గుతుంది.
తెల్ల గుమ్మడికాయల్లో లుటిన్, జియాక్సంతిన్ సమృద్ధిగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కళ్లని ఇవి రక్షిస్తాయి.
తెల్ల గుమ్మడికాయని క్రమం తప్పకుండా తినడం వల్ల విటమన్ ఏ అందుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గుమ్మడికాయల్లోని ఆకుపచ్చని విత్తనాల్లో యాంటీ-ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, కీళ్లవాపును తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
గుమ్మడికాయ గుజ్జుతో చేసిన మూలిక కాషయాన్ని తాగడం వల్ల పేగుల్లో మంట కూడా తగ్గుతుంది.
తెల్ల గుమ్మడికాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆస్తమా రోగుల ఆరోగ్యం మెరుగువుతుంది.