ఐతే మీరు ఏ పని చేయక పోయినా ఒళ్లు నొప్పులకు గురి అవుతున్నారు అంటే ఏదో సమస్య ఉన్నట్లే లెక్క.. అంటున్నారు డాక్టర్లు.
మరి ఈ ఒళ్లు నొప్పులు ఎందుకు వస్తాయో నిపుణులు వివరించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేకపోవడం శరీరానికి తగినంతగా నిద్ర లేకపోతే బాడీ వీక్ అవుతుంది. దీంతో ఒళ్లు నొప్పులు వస్తాయని వైద్యలు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ శరీరానికి తగినంతగా నీరు అందివ్వాలి. బాడీకి కావాల్సిన నీరు ఇవ్వకపోతే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. ఇదీ ఒక విధంగా నొప్పులకు దారి తీస్తుంది.
ఒత్తిడి మనిషికి ఒత్తిడి ఎక్కువైతే అలసట అనిపిస్తుంది. దాంతో శరీరంలో మార్పులు జరిగి బలహీనంగా మారిపోతారు.
ఆర్థరైటిస్ కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్ ఉంటే సాధారణంగానే బాడీ నొప్పులకు గురవుతుంది.