ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది.

విటమిన్ ఎ, విటమిన్ బి-6, కాల్షియం, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. 

ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. జుట్టు సమస్యలకు చక్కని పరిష్కారం చూపిస్తుంది. 

ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఉసిరితో వాంతులు, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. 

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరిని కొందరు మాత్రం తినకూడదు.

బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు ఉసిరికాయలను తినకూడదు. 

తినాలనిపిస్తే తక్కువ తినచ్చు కానీ ఎక్కువగా తినకూడదు. ఉసిరి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

అందుకే రక్తంలో చక్కర స్థాయి తక్కువ ఉన్నవారు ఉసిరి ఎక్కువ తినకూడదు. 

ఎసిడిటీ ఉన్నవారు ఉసిరి తినకూడదు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల ఎసిడిటీ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి.

శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఉసిరి జోలికి పోనే పోకూడదు. 

శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఉసిరికాయ తినడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. 

అందుకే కొన్ని రోజుల పాటు ఉసిరిని దూరం పెట్టడం మంచిది.

డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు ఉసిరి కాయను పొరపాటున కూడా తినకూడదు. 

ఎందుకంటే ఉసిరి డీహైడ్రేషన్ సమస్యను మరింత పెంచుతుంది.