పట్టుదలతో చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అని నిరూపించారో మహిళ

కలలు కనండి..  ఆ కలలను సాకారం చేసుకోండన్న అబ్దుల్ కలాం మాటలను తూచా తప్పకుండా పాటించింది

చిన్నప్పుడే వ్యాపార వేత్తగా ఎదగాలన్న ఆమె ఆశయాన్ని నేరవేర్చుకోవడంతో పాటు దేశాకికి కొంత సేవ చేయాలన్న సంకల్పాన్ని సఫలీకృతం చేసుకుంది.

పిల్లలకు ట్యూషన్ చెప్పే స్థాయి నుండి ఎంతో మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది  త్రినా దాస్.

పశ్చిమ బెంగాల్‌లో పుట్టిన త్రినా.. కోల్‌కతాలోని బల్లిగంజ్ శిక్షా సదన్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చదివింది

చదువుకుంటూనే ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పేది. చాలా తక్కువ ఫీజుతోనే 11,12 తరగతుల విద్యార్థులకు భౌతిక, రసాయ శాస్రంతో పాటు లెక్కలు బోధించేది.

16 మందితో మొదలైన తన ట్యూషన్ .. 1800 మందికి చేరింది. దీంతో మరికొంత మంది ఉపాధ్యాయులను నియమించుకుంది.

 ఆమె ఆదాయం పెరగడం ప్రారంభమైంది. ఏడాదికి రూ. 8 నుంచి 10 లక్షలు సంపాదించింది.

అనంతరం ఫ్రాంచైజ్ ద్వారా 86 కోచింగ్ సెంటర్లు పెట్టింది. వీటి ద్వారా 2014-15 నాటికి రూ. 5 కోట్లకు ఆర్జించింది.

అనంతరం మరో రంగంలోకి అడుగు పెట్టింది. త్రినా దాస్ 2017లో తన ఇద్దరు స్నేహితులైన నీరజ్ దహియా, అరుణ్ సెహ్రావత్‌తో కలిసి టాలెంట్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రారంభించింది. 

ఒక సంవత్సరంలో సుమారు రూ. 20 కోట్లు సంపాదించారు వాళ్లు. మొదటి లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుర్గావ్, ఢిల్లీలోని అనేక కంపెనీలకు సెక్యూరిటీ వర్కర్లు, డెలివరీ బాయ్స్, ఆఫీస్ వర్కర్స్ ఉద్యోగాలను అందించడం ప్రారంభించారు.

2022లో గిగ్‌చెయిన్ ప్రారంభించి కంపెనీలకు ఉద్యోగులను అందించాలని నిర్ణయించకుకున్నారు. అదీ కూడ సక్సెస్ కావడంతో వ్యాపార వేత్తగా ఎదిగారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుండి కూడా  ఆమె ప్రశంసలు పొందింది. 

ప్రస్తుతం ఆమె సంస్థ టర్నోవర్ రూ.102 కోట్లు