ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలామంది రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారు. దీనివల్ల కంటి నొప్పి, తలనొప్పి, నడుము నొప్పి, చేతి, భుజాల నొప్పులు వస్తున్నాయి.

మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాళ్లు ఈ చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!

రెండు మూడు గంటల కంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవద్దు.

అలా చేస్తే మీకు వెన్నునొప్పి సమస్యలు రావొచ్చు. కాబట్టి మీ పనిశైలిని మార్చుకోండి.

స్టాండింగ్ డెస్కులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించండి.

అప్పుడప్పుడు లేచి చుట్టూ తిరగడం, కదిలే పని ఏదైనా చేయడం మంచిది.

ప్రతి గంటకు అలారం సెట్ చేసుకుని, నడకకు వెళ్లండి. ఇంటిపని కూడా చేయండి. 

ఇలా చిన్న చిన్న పనులు చేయడం వల్ల మెడ, వీపుపై ఒత్తిడి తగ్గుతుంది.

అలానే ఆఫీసులో ఎలివేటర్, లిఫ్ట్ బదులు మెట్లను ఉపయోగించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

నిరంతరం కంప్యూటర్ ని చూస్తూ కూర్చుంటే కళ్లు మంటలు ఏర్పడతాయి.

అప్పుడప్పుడు కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. దీనివల్ల కళ్లతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కళ్ల అలసట తగ్గుతుంది. కళ్లకు చల్లదనం కూడా అవుతుంది.

పనికి కాసేపు విశ్రాంతినిచ్చి పచ్చని పర్యావరణాన్ని చూసినా కళ్లకు చాలా మంచిది.

కంప్యూటర్ ముందు కూర్చొని జంక్ ఫుడ్ తినేస్తుంటారు. దీనిబదులు ఫ్రూట్స్, ప్రొటీన్స్ ఉండే ఆహారం తినండి. అప్పుడు ఊబకాయం సమస్యలు రావు

కంప్యూటర్ డెస్క్ అనేది శుభ్రంగా ఉండేలా చూడండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.