కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అంటారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడానికి హీరోలు, హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు.
ముఖ్యంగా హీరోయిన్స్ అయితే పెళ్ళికి సమయం ఉందని కెరీర్ పై ఫోకస్ చేస్తుంటారు.
ఈ తరుణంలో 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటారు.
కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకున్నారు.
మరీ 17, 18 ఏళ్ళకి కూడా పెళ్లి చేసుకున్న నటీమణులు ఉన్నారు. వారెవరో ఓ లుక్కేయండి.
దివ్య భారతి: 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 1992లో సాజిద్ నడియడ్ వాలాతో ఈమె వివాహం జరిగింది.
అదితిరావు హైదరీ: 21 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 2009లో సత్యదీప్ మిశ్రా అనే నటుడ్ని వివాహమాడింది. 2013లో విడిపోయారు.
షాలిని: 21ఏళ్ల వయసులో తమిళ సూపర్ స్టార్ అజిత్ ను పెళ్లి చేసుకుంది. 2000వ సంవత్సరంలో వీరి వివాహం జరిగింది.