నేడు ప్రేమికులు రోజు. మనసుకు నచ్చిన వారికి తన ప్రేమను తెలియజేసి.. వారు అంగీకరిస్తే.. జీవితాంతం కలిసుందామని బాసలు చేసుకునే రోజు. ప్రస్తుత కాలంలో సమాజంలో ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి. ఇక మన ఇండస్ట్రీలో జరగిని ప్రేమ వివాహాల మీద మీరు ఓ లుక్కేయండి.

సీనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతి:    74 ఏళ్ల వయసులో లక్ష్మీ పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.

కృష్ణ - విజయ నిర్మల: సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మొదటి భార్య ఇందిరా దేవిని ఒప్పించి విజయ నిర్మలను ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

కమల్ హాసన్ - సారిక: కమల్ హాసన్ సైతం ప్రేమ వివాహమే చేసుకున్నాడు. 80ల్లో సారికతో ప్రేమలో పడిన కమల్.. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.

 నాగార్జున - అమల: నాగార్జున కూడా ప్రేమ పెళ్లే చేసుకున్నాడు. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగార్జున.

శ్రీకాంత్ - ఊహ: ‘ఆమె’ సినిమాలో మొదటిసారి కలిసి నటించిన ఈ జోడీ.. ఆ తర్వాత ప్రేమలో పడటం.. పెళ్లి పీటలెక్కడం జరిగింది.

రాజశేఖర్ - జీవిత: రాజశేఖర్ పేరు చెప్తే వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు జీవిత. ఈ ఇద్దరి జోడీ అన్యోన్యతకు మారుపేరు. 1991లో జీవిత, రాజశేఖర్ పెళ్లి చేసుకున్నారు.

మహేష్ బాబు - నమ్రత: వీరి లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు. 

 పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్: పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యతో విడిపోయిన తర్వాత.. ఏడేళ్లకు పైగా రేణు దేశాయ్తో సహజీవనం చేసి 2008లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నళ్ల క్రితం విడిపోయారు.

విష్ణు - విరోనికా: మంచు విష్ణు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కూతురు అయిన విరోనికాను ప్రేమించి.. మోహన్ బాబును ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు విష్ణు.

 అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ప్రేమ వివాహమే చేసుకున్నాడు. స్నేహా రెడ్డిని ప్రేమించి..పెద్దలను ఒప్పించి 2011లో పెళ్లి చేసుకున్నాడు బన్నీ. 

నాని - అంజనా: న్యాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నపుడే అంజనా ప్రేమలో పడిపోయాడు. తాను హీరో అయిన తర్వాత ఇంట్లో ఒప్పించి 2012లో ఒక్కటయ్యారు నాని, అంజనా.

 రామ్ చరణ్ - ఉపాసన: మెగా వారసుడు రామ్ చరణ్ సైతం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉపాసనతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈయన.. ఇరు కుటుంబాలను ఒప్పించి 2012లో ఒక్కటయ్యారు. 

నాగ చైతన్య - సమంత: ఈ ఇద్దరూ తమ ఆరేళ్ల రిలేషన్ను పెళ్లిగా మార్చుకున్నారు. నాలుగేళ్ళ పెళ్లి బంధం తర్వాత 2021 అక్టోబర్లో విడిపోయారు.

రానా-మిహీకా బజాజ్: 2020లో ఈయన తను ప్రేమించిన మిహీకాను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు రానా.

అజిత్ - శాలిని: తమిళ హీరో అజిత్.. హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్: ధనుష్, ఐశ్వర్య కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు.  2004లో ప్రేమించి వీరి వివాహం అయ్యింది. ఈ మధ్యే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

 సూర్య - జ్యోతిక: తమిళ హీరో సూర్య  జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2006లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.