ఏ మనిషికైనా తన శవపేటికను తనే తయారు చేయించుకునే పరిస్థితి రాదు. అసలు అంత ధైర్యం కూడా ఉండదు.

కానీ ఖమ్మం యువకుడు హర్షవర్ధన్ మాత్రం తన శవపేటికను తనే దగ్గరుండి తయారు చేయించుకున్నాడు.

ఆస్ట్రేలియాలో వైద్యుడిగా చేసే హర్షవర్ధన్ గాథ కన్నీరు పెట్టిస్తోంది.

చావు తేదీ ముందుగానే ఫిక్స్ అయిపోయింది. అయినా చాలా ధైర్యంగా ఉన్నన్ని రోజులు జీవించాడు.

జీవించానన్ని రోజులూ కుటుంబ సభ్యుల గురించే ఆలోచించాడు.

తను చనిపోయాక మృతదేహం కోసం ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు, ఆస్ట్రేలియాలో ఉన్న స్నేహతులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాడు.

తన శవపేటికను తనే సిద్ధం చేసుకున్నాడు. మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి శవపేటికను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నాడు.

తను చనిపోయాక తన మృతదేహాన్ని భారత్ కు తరలించడం కోసం అక్కడి ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాడు.

దీని కోసం అయ్యే ఖర్చు కూడా హర్షనే పెట్టుకున్నాడు.

అక్కడ లాయర్ తో మాట్లాడుకుని.. ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా డాక్యుమెంట్లు పూర్తి చేశాడు.

చివరకు చనిపోయాక తన మృతదేహం ఇండియాకి వెళ్లేలా చేసుకున్నాడు. ఎవరికీ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూసుకున్నాడు.  

స్నేహితులు సైతం ఇబ్బందులు పడతారేమో అని అసలు వాళ్ళకి ఖర్చు పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. అంత గొప్ప మనిషి హర్ష.

‘ఒరేయ్.. నేను చనిపోయాక నన్ను ఈ బాక్సులో భారత్ కి తరలించండిరా’ అని స్నేహితులకు చెప్పాడు.

ఇలా తన మృతదేహం ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నాడు.