భారత దేశంలో గురువులకు ప్రత్యేక స్ధానం ఉంది. వారిని దేవుడితో సమానంగా చూస్తారు.

బడి దేవాలయం అయితే అందులో చదువు చెప్పే ఉపాధ్యాయులే దేవుళ్లు 

మంచి ఏదో.. చెడు ఏదో తెలిపి మనల్ని సరైన మార్గంలో నడిపించే గొప్ప వ్యక్తి గురువు.  

వారిని గౌరవించడానికి ఏటా సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 

ఇక ఆ రోజు పాఠశాలలు,  కళాశాలల్లో ప్రసంగ పోటీలు, వ్యాసరచన పోటీలు ఉంటాయి. 

అయితే ఆ పోటీల్లో మీరు కూడా స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఈ కింది ఐడియాలు చదివేసేయండి.. 

టీచర్స్ డే  సందర్భంగా గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ప్రారంభించాలి.

దేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును  ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసిద్ధ తత్వవేత్తే కాదు మంచి విద్యావేత్త కూడా. 

తమిళనాడులోని తిరుమణి అనే చిన్న గ్రామంలో 1888 సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 27 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు.

1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు భారతరత్న పురస్కారం కూడా లభించింది.

ఉపాధ్యాయులను గౌరవించడానికి ఏటా ఆయన పుట్టిన రోజైనా సెప్టెంబర్ 5 న టీచర్స్ డే గా  జరుపుకుంటున్నారు. 

ఉపాధ్యాయులు కేవలం బోధకులే కాదు పిల్లల మంచి మార్గంలో నడిపించే మార్గదర్శకులు కూడా వీరే.. 

విద్యార్ధులను సమాజంలో మంచి వ్యక్తులుగా మార్చడానికి గురువులే కీలకం.

ఇక చివరిగా మరోసారి గురువులందరికీ నమస్కరిస్తున్నాను.

మాలోని తప్పులను తొలగించి.. మమ్మల్ని మంచి వ్యక్తులుగా మార్చిన ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు.

వీటితో పాటు ఉపాధ్యాయులకు సంబంధించిన మరికొన్ని  విషయాలు తెలుసుకుంటే ఉపయోగపడతాయి.