బంగారం మీద పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు వస్తున్నాయి.

బంగారం అంటే భౌతికంగా ఉండేది మాత్రమే కాదు. డిజిటల్ గా ఉన్నా బంగారం బంగారమే.

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటైన 'సావరిన్ గోల్డ్  బాండ్' స్కీమ్ లో  ఇన్వెస్ట్ మెంట్ చేయడం చాలా సులభం.

సావరిన్ గోల్డ్ బాండ్లు కొన్నవారికి ఇప్పుడు అధిక లాభాలు వస్తున్నాయి.

ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ లో బ్యాంకులు, పోస్టాఫీసు పథకాల్లో కంటే ఎక్కువ వడ్డీ వచ్చింది.

ఎనిమిదేళ్ల క్రితం గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు ఏకంగా 13.7 శాతం రాబడి వచ్చింది.

 2015-2023 వరకూ 8 ఏళ్లలో సగటున గోల్డ్ బాండ్లు వార్షికంగా 13.7 శాతం మేర  ఆదాయం తీసుకొచ్చాయి.

ఈ 8 ఏళ్లలో మొత్తం 63 విడతలలో గోల్డ్ బాండ్లు కొంటూ వచ్చిన వారికి 4.48 నుంచి 51.89 శాతం వరకూ లాభాలు వచ్చాయంట

అయితే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం.

ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే గ్రాము బంగారంపై డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఒక వ్యక్తి గరిష్టంగా 4 కిలోల వరకూ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయవచ్చు.

 ఈ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ వ్యవధి 8 ఏళ్ళు వరకు ఉంటుంది.   ఆతరువాత వాటిని అమ్ముకోవచ్చు.

అత్యవరసమైతే 5 ఏళ్ల తర్వాత  అయినా గోల్డ్ బాండ్లను అమ్ముకోవచ్చు. కానీ తక్కువ వడ్డీ లభిస్తుంది.

బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.