సూపర్ స్టార్ రజనీకాంత్ కి కష్టాలు తప్పట్లేదు. ఇద్దరు కుమార్తెల ఇళ్లలోనూ వరస దొంగతనాలు జరిగాయి.

అయితే ఈ రెండు చోరీలు కూడా నెలన్నర గ్యాప్ లోనే జరగడం పలు అనుమానాలు వచ్చేలా చేస్తోంది.

మార్చి 22న రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య.. తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

లాకర్ లోని 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రభరణాలు, 4 కిలోల వెండి, ఆస్తి పత్రాల్ని మాయమయ్యాని పేర్కొంది.

దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించారు. ఐశ్వర్య ఇంట్లో పనిమనిషి-డ్రైవర్ దగ్గర ఆ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం 'లాల్ సలామ్' మూవీని డైరెక్ట్ చేస్తున్న ఐశ్వర్య ఆ బిజీగా ఉండటం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతోనే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.

సరే అయిపోయిందేదో అయిపోయిందని రజనీకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్లకు మరో షాక్ తగిలింది.

ఎందుకంటే చిన్న కూతురు సౌందర్య కూడా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తన ఇంట్లోని కొన్ని వస్తువులు పోయాయని చెప్పుకొచ్చింది.

గతనెల అంటే ఏప్రిల్ 23న ఓ పనిపై తేనంపెట్టాయ్ లోని ఓ కాలేజీకి తన రేంజ్ రోవర్ కారులో సౌందర్య రజనీకాంత్ వెళ్లింది.

తిరిగి ఇంటికొచ్చేసరికి కారు స్పేర్ తాళంతోపాటు ఓ పౌచ్ కూడా కనిపించకపోవడంతో ఈమె అలెర్ట్ అయిపోయింది.

దానికోసం చాలా వెతికారు గానీ దొరక్కపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ విషయం కాస్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెలరోజుల వ్యవధిలో వరస దొంగతనాలు జరగడం హట్ టాపిక్ అయింది.

మరి అంతపెద్ద సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ కూతుళ్ల ఇళ్లలోనే చోరీలు జరుగుతున్నాయి. నార్మల్ ప్రజలెంతా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరి నెల-నెలన్నర గ్యాప్ లో రజనీకాంత్ కుమార్తె ఇళ్లలో దొంగతనాలు జరగడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.