సౌందర్య.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది సిని పరిశ్రమలో సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చిన్న వయస్సులోనే సుమారు 100 సినిమాల్లో నటింటి రికార్డు సృష్టించింది సౌందర్య.
మహానటి సావిత్ర తరువాత నటనలో సౌందర్య అంతటి పేరు తెచ్చుకుంది. మహిళా అభిమానులతో పాటు సౌందర్యకు అన్ని వయసుల వారు ఫ్యాన్స్ అయ్యారంటే ఆమె నటన ఏంత గొప్పగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
ఒకప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అగ్ర హీరొలందరి సరసన సౌందర్య నటించింది.
సౌందర్య లాగే మాట్లాడుతూ చేసిన వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సౌందర్య మళ్లీ పుట్టిందా అని కామెంట్ చేస్తున్నారు. చిత్ర అచ్చు సౌందర్య లాగే ఉందని, సినిమాల్లో నటిస్తే బావుంటుందని నెటిజెన్స్ అంటున్నారు.
chitra_Jii02 పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చిత్ర వీడియోను మీరు చూడవచ్చు. ఖచ్చితంగా మీకు సౌందర్యను చూసిన అనుభూతి కలుగుతుంది.