భూ ప్రపంచంలో తల్లికి మించిన యోధురాలు ఎవర్వూ లేరు.

నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి.. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది.

ఇక తన కోరికలను, సంతోషాలను వదులుకుని బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తుంటారు.

చివరకు వారికి ఉన్న కోరికలు కూడా చంపుకుని బిడ్డల కోసం పరితపిస్తుంటారు.

వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లి కోరికను.. తనయుడు తీర్చాడు.

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం.. తన తల్లి రజీయ(85) కోరికను తీర్చాడు.

తనకు తాజ్ మహల్ చూడాలని ఉందని తన మనస్సులోని కోరికను కోడుకుతో చెప్పుకుంది.

 ఇంతకాలం తమ ఉన్నతకి పాటుపడిన తల్లి కోరిక తీర్చాలని ఆ కుమారుడు భావించాడు.

నడవలేని స్థితిలో ఉన్న ఆమెను  ఇబ్రహీం దంపతులు సోమవారం ఆగ్రాకు  తీసుకొచ్చారు.

సోమవారం ఆగ్రాకు వచ్చి.. తన తల్లిని స్ట్రైచర్ పైనే తిప్పుతూ తాజ్ మహల్ మొత్తం చూపించారు.

 నడవలేని స్థితిలో ఉన్న రజియా ఆ పాలరాతి నిర్మాణాన్ని చూసి ఓ సంతోషం వ్యక్తం చేసింది.

తన తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇబ్రహీం తెలిపారు.

తల్లి కోరిక తీర్చిన ఇబ్రహీం దంపతులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తల్లికి కడుపు నిండా అన్నం పెట్టడానికి ఆలోచించే కఠినమైన పుత్రులు ఇబ్రహిను ఆదర్శంగా తీసుకోవాలి.