ఎండా కాలం వచ్చిందంటే చాలు బీరు ప్రియుల ప్రాణం మొత్తం బీర్ల మీదే ఉంటుంది.

బీరు తాగితే శరీరం కూల్‌ అవుతుందని భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు.

అందుకే.. ప్రతి రోజు కాకపోయినా వీలు చిక్కినప్పుడల్లా బీర్లు తాగుతూ ఉంటారు కొంతమంది.

అసలే ఎండా కాలం.. పైగా బీరు ప్రియులు ఊపు మీద ఉంటారు. దీన్ని క్యాష్‌ చేసుకోవటానికి కొన్ని వైన్‌ షాపులు బరితెగిస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా, సదాశివ పేటలోని ఓ వైన్‌ షాపు కొంతమంది యువకులకు ఎక్స్‌పైర్‌ అయిన బీర్లను అమ్మింది.

ఎల్లారం గ్రామానికి చెందిన కొందరు యువకులు సదరు వైన్‌ షాపులో పుట్టినరోజు వేడుకకోసం 12 బీర్లు కొన్నారు.

పుట్టిన రోజు వేడుక సందర్భంగా బీర్లు తాగిన కొంతమందికి వాంతులు అయ్యాయి.

బీర్లను పరిశీలించి చూడగా వాటి కాలం చెల్లిఉంది.

దీంతో యువకులు ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎక్సైజ్‌ సీఐ షాపు దగ్గరకు వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు షాపు దగ్గరినుంచి నాలుగు కల్తీ బీరు కాటన్లను స్వాధీనం చేసుకున్నారు.