‘శ్రేయాస్ అయ్యర్’ ఈ పేరు ఇప్పుడు టీమిండియా క్రికెట్ లో బాగా వినిపిస్తున్న పేరు.

న్యూజిలాండ్ పై టెస్టుల్లో అరంగేట్రం చేసి మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు శ్రేయాస్ అయ్యర్.

బ్యాట్స్ మన్స్ అందరూ పెవిలియన్ బాట పడుతున్న సమయంలో నికలకడగా బ్యాటింగ్ చేస్తూ జట్టులో ఉత్సాహాన్ని నింపాడు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శ్రేయాస్ అయ్యర్ గురించి వెతుకులాట ఎక్కువై పోయింది.

అందుకే అయ్యర్ గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం

 అయ్యర్ పూర్తి పేరు.. శ్రేయాస్ సంతోష్ అయ్యర్. డిసెంబరు 6, 1994న జన్మించాడు.

శ్రేయాస్ తల్లిదండ్రుల పేర్లు రోహిణీ అయ్యర్, సంతోష్ అయ్యర్.

 డొమెస్టిక్ క్రికెట్ లో ముంబయి తరఫున, ఐపీఎల్ లో ఢిల్లీ కెప్టెన్ గా చేశాడు శ్రేయాస్ అయ్యర్.

టీమిండియా తరఫున వన్డే, టీ20, తాజాగా న్యూజిలాండ్ పై టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.

2014లో ఐసీసీ అండర్- 19 క్రికెట్ వరల్డ్ కప్ లో ఆకట్టుకున్నాడు.

 మొత్తం 104 లిస్ట్-A మ్యాచ్ లలో 3,976 పరుగులు చేశాడు శ్రేయాస్ అయ్యర్.

కేవలం 54 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో 4,592 రన్స్ స్కోర్ చేశాడు. 202 నాటౌట్ హైఎస్ట్ స్కోర్.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 12 శతకాలు, 23 హాఫ్ సెంచరీలు చేశాడు.

నవంబర్ 1, 2017లో న్యూజిలాండ్ పై టీ20ల్లో, డిసెంబరు 10, 2017న శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు.

2014-15 డెబ్యూ రంజీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ 809 పరుగులు చేశాడు. ఏడో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.