బొప్పాయి   పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బొప్పాయి సుమారు 400 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 

తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 

ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్‌ సి దంతాల, - చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది.

విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. 

బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. 

ఈ పండు తింటే గర్భస్రావం అవుతుందని, గర్భిణులు తినకపోవడమే మేలని పెద్దలు చెపుతుంటారు.

కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది.

మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. 

బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది.

నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది. 

గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది.

బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. దీనిలో తెల్లని గుజ్జు ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.

బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు. కొలెస్ట్రాల్‌ అసలు ఉండదు. క్యాలరీలూ తక్కువే. కాబట్టి ఎవరైనా ఈ పండును తినొచ్చు.