‘బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ వీజే సన్నీ. ‘కప్పు ముఖ్యం బిగులూ’ అంటూ కప్పు కొట్టేశాడు.

వీజే సన్నీగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ సన్నీగా ఎలా మారాడో తెలుసుకుందాం.

సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి.. రిపోర్టర్, వీజే, యాక్టర్ ఇలా తన కెరీర్ కు బాటలు వేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చాడు.

వీజే సన్నీ గెలవడానికి గల కారణాల్లో ముఖ్యమైంది.. సన్నీ మొదటి నుంచి మంచి ఎంటర్ టైనర్.

బుల్లితెర ప్రేక్షకులు సన్నీని ఓన్ చేసుకోవడానికి మరో కారణం అతని యాటిట్యూడ్.

కోపం వస్తే అరుస్తాడు, ప్రేమ వస్తే కౌగిలించుకుంటాడు, టాస్కులొస్తే తన వందశాతం ఎఫర్ట్ పెడతాడు ఆ యాటిట్యూడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

సన్నీ విజయానికి మరో కారణం మానస్, కాజల్ తో అతనికున్న ఫ్రెండ్ షిప్.

తన ఫ్రెండ్స్ కోసం సన్నీ ఏదైనా చేస్తాడు. అది ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయినా కూడా సింపుల్ గా ఇచ్చేయడం ప్రేక్షకులకు బాగా నచ్చింది.

కత్తిపోట్లు టాస్కు నుంచి సన్నీపై ప్రేక్షకులకు అభిప్రాయం మారింది. అప్పటి వరకు అందిరిలానే సన్నీని కూడా చూశారు.

కత్తిపోట్లు టాస్కు తర్వాతి నుంచి ప్రేక్షకుల్లో సన్నీపై సింపథి పెరిగింది.

ప్రతి విషయానికి సన్నీని అందరూ టార్గెట్ చేయడం కూడా సన్నీకి బాగా ప్లస్ అయ్యింది.

సన్నీ విజయానికి కళావతి కూడా ఇంకో కారణం. కళావతి కోసం అయినా సన్నీకి ఆ కప్ ఇచ్చేయాలి అని ఫిక్స్ అయ్యారు.

బిగ్ బాస్ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తిలో తన ట్రూ క్యారెక్టర్ ను బయటకు తీయడం. అది సన్నీ చేయగలిగాడు అని ప్రేక్షకులు నమ్మారు.

ఒక వ్యక్తిగా సన్నీని అభిమానిస్తూ చివరకు విన్నర్ ను చేశారు.