నేరేడు పండ్లు తినడం వల్ల చాలా రాకల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలిసిందే.

క్రోమియం పుష్కలంగా ఉండే ఈ పండ్లు మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. 

ఇదే కాకుండా నేరేడు పండ్లలో ఎన్నో ఔషద గుణాలు కూడా దాగి ఉన్నాయి. 

అయితే నేరేడు పండ్లు మాత్రమే కాదు.. నేరేడు ఆకులతో కూడా ఊహించలేని లాభాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

అసలు నేరేడు ఆకులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆ ఆకులతో రసాన్ని ఎలా తయారు చేయాలనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

ముందుగా వేడి నీటిలో కొన్ని నేరేడు ఆకులను వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత అందులో ఏర్పడిన రసాన్ని తీయాలి.

మల విసర్జన సమస్యతో బాధపడేవారు లేత నేరేడు ఆకులు నమిలి తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.

అధిక బరువుతో బాధపడేవారు సైతం నేరేడు ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట.

నేరేడు చెట్టు చిగుళ్ల నుంచి తీసుకున్న ఆకులను రోజూ నమిలి తినడం ద్వారా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. 

నోట్లో దుర్వాసన ఉండేవారు ఈ ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది.

ఈ ఆకుల రసాన్నితాగడం ద్వారా కాలేయం పని తీరు కూడా మెరుగు పడుతుందని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు

జ్వరం వచ్చినప్పుడు నేరుడు ఆకుల రసంలో ధనియాలు వేసి తగిన మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.