సహజంగా మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పువ్వులు పరిమళాన్ని వెదజల్లడంతో పాటు వేడుకల్లో డెకరేషన్ కు కూడా వాడుతుంటాము.

ఎన్నో రకాల రోగాలకు కూడా కొన్ని రకాల పువ్వులతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడతారన్న విషయం మనకు తెలిసిందే. 

తంగెడు పువ్వులతో తయారు చేసిన పొడిని షుగర్ వ్యాధిగ్రస్తులో తరుచు తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని అదుపులోకి పెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నాగకేసర పువ్వులతో కూడా అనేక లాభాలు ఉన్నాయని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

అసలు నాగకేసర పువ్వలతో ఎలాంటి లాభాలు ఉన్నాయి? వ్యాధిగ్రస్తులు ఆ పువ్వులను ఎలా ఉపయోగించాలనే పూర్తి వివరాలు మీ కోసం.

చలికాలం సీజన్ లో చాలా మంది జలుబు సమస్యతో బాధపడుతుంటారు. 

ముఖ్యంగా జలుబు సమస్యతో బాధపడేవారు నాగకేసర పువ్వులను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

జలుబు సమస్యతో బాధపడేవారు నాగకేసర పువ్వులను నలిపి నుదిటిపై రాసుకోవాలి. 

అలా నుదిటిపై రాసుకోవడం వల్ల జలుబు సమస్య నుంచి కాస్త బయటపడొచ్చని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

అజీర్ణం సమస్య ఉన్నవారు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో నాగకేసర పువ్వుల పొడి, తేనే కలుపుకుని తాగాలి. 

ఇలా కలుపుకుని తాగడం ద్వారా అజీర్ణం సమస్య నుంచి బయటపడొచ్చు.

నాగకేసర పువ్వుల పొడి, తేనే కలిపిన గ్లాసు నీరు తీసుకోవడం ద్వారా అసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం పొందవచ్చు.

కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు ఉన్నవారు బయట దొరికే నాగకేసర నూనేను రుద్దుకోవడం ద్వారా కాస్త ఆ నొప్పుల నుంచి కాస్త బయటపడొచ్చని తెలుస్తోంది.

నాగకేసర పొడిని చెరుకు రసంలో కలుపుకుని తాగితే వెక్కిళ్ల నుంచి కూడా బయటపడొచ్చని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.