వేసవి కాలం రావడంతో ప్రస్తుతం ఎండలు విపరీతంగా దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రత్తలు పెరుగుతున్నాయి.

 ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు అందరూ శరీరానికి చల్లదానాన్ని ఇచ్చే రక రకాల కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు వంటివి తీసుకుంటుంటారు.

మరీ ముఖ్యంగా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.

పుచ్చకాయలు తినడం వల్ల అలాంటి వ్యాధులు రాకపోవడమే కాకుండా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

 వేసవిలో దొరికే పుచ్చకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వేసవి కాలంలో దొరికే పుచ్చకాయను తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

 ఇందులో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని తరలించడంలో బాగా సహాయపడుతుంది.

పుచ్చకాయను తినడం వల్ల గుండెపోటు సమస్య నుంచి కూడా బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పుచ్చకాయలో ఉండే విటమిన్ A ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాటును అందిస్తుంది.

 దీనిని తినడం వల్ల మలబద్దం సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా పుచ్చకాయ చర్మసంరక్షణ కోసం సహాయపడుతుందట.

ఇలా ఎన్నోరకాల లాభాలు ఉన్న పుచ్చకాయను తినాలంటూ పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.