కడుపు నిండా తిండి ఎలాగో కంటి నిండా నిద్ర అలా అని చెబుతారు. కంటి నిండా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
అయితే నిద్రలో కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకంగా నిద్రపోతే గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వేసుకునే దుస్తులను బట్టి నిద్ర అనేది ఉంటుంది. రాత్రిపూట శరీరాన్ని నొక్కేసినట్టు ఇరుగ్గా ఉండే దుస్తులు కాకుండా లూజ్ బట్టలు వేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
నిజానికి నగ్నంగా నిద్రపోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఇంకా బాగుంటుందని చెబుతున్నారు.
మామూలుగా రాత్రిపూట దంపతులు శృంగారంలో పాల్గొనే ముందు దుస్తులు తీసేస్తారు. కార్యం పూర్తయ్యాక దుస్తులు వేసుకుంటారు.
అలా కాకుండా నగ్నంగా నిద్రపోతే ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీవిత భాగస్వామితో కలిసి నగ్నంగా నిద్రపోతే ఇద్దరి శరీరాలకు మధ్య కాంటాక్ట్ పెరిగి ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయని, దీని వల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.
ఇక మంచి నిద్ర వల్ల బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి నిండా నిద్రపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది.
దీని వల్ల బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి పెరిగి జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది అధిక బరువు, షుగర్ సమస్యలను తగ్గిస్తుంది.
సరైన నిద్ర లేకపోవడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నగ్నంగా నిద్రపోవడం వల్ల నిద్ర బాగా పడుతుందని.. గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రుళ్ళు బిగుతుగా ఉండే లో దుస్తులు వేసుకోవడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. లోదుస్తులు స్త్రీల యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ సమస్యకు కారణమవుతాయని చెబుతున్నారు.
అందుకే రాత్రి పూట వీలయితే నగ్నంగా పడుకోవాలని సూచిస్తున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
లూజ్ గా ఉండే లో దుస్తులు వేసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు
ముఖ్యంగా లూజ్ గా ఉండే లోదుస్తులు వేసుకునే మగవారిలో స్పెర్మ్ కౌంట్ అధికంగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.
రాత్రుళ్ళు నగ్నంగా నిద్రపోవడం వల్ల వ్యక్తిగత అవయవాలు సురక్షితంగా ఉంటాయని యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్, బయోటెక్ ఇన్ఫర్మేషన్ డేటాలు చెబుతున్నాయి.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.