చలికాలం వచ్చిందంటే చాలు.. ఒక్క అంగుళం కూడా కనబడకుండా పూర్తిగా దుప్పటి కప్పుకుని నిద్రపోతారు చాలా మంది.
ముఖం నుంచి పాదాల వరకూ ఏమీ కనిపించకుండా దుప్పటి లోపల దాచేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దుప్పటితో పూర్తిగా శరీరాన్ని కప్పుకుని పడుకోవడం వల్ల గుండెపోటు,ఆస్తమా సహా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
దుప్పటితో ముఖం మూయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
నోటిని, ముక్కుని దుప్పటితో కప్పడం వల్ల ఆక్సిజన్ ప్రవాహానికి అంతరాయం కలుగుతుందని అంటున్నారు.
శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. ఈ కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది.
ఊబకాయం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెదడుకి తగినంత ఆక్సిజన్ అందితేనే మానసిక ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు.
శరీరాన్ని పూర్తిగా దుప్పటితో కప్పడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. అలసిపోవడం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు వస్తాయి.
కాబట్టి దుప్పటితో ముఖాన్ని మూయకుండా గాలి ఆడేలా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముక్కు, నోటి మీద దుప్పటి కప్పకూడదు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం మాత్రమే. దీనిపై పూర్తి అవగాహన కోసం వైద్యులను సంప్రదించవలసిందిగా మనవి.