ఎండా కాలం వచ్చిందంటే పలు రకాల చర్మ సంబంధింత సమస్యలు ఏర్పడుతుంటాయి.

మొటిమలు, చర్మం పొడిబారడం, చమట పొక్కులు లాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటారు.

చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవడం రక రకాల క్రీములు, పార్లర్ల చుట్టు తిరుగుతుంటారు. 

ప్రతిరోజూ  వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడిగితే చాలా మంచిది

పల్చటి కాటన్ దుస్తులు ధరిస్తే చాలా మంచిది

వేసవిలో కాలంలో చర్మానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం... రాత్రి పడుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు  ప్రతిరోజూ  కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. 

కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయలతో పాటు తాజాగా పండ్లను రసాలను తాగాలి. 

ప్రతిరోజూ మీ డైట్ లో  పెరుగు, మజ్జిగ తప్పని సరి చేయాలి. 

ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. నూన పదార్థాలు, గరం మసాలలకు దూరంగా ఉండాలి.

ఎక్కువగా కూల్ డ్రింక్స్, కోల్డ్ వాటర్ తాగకూడదు..  కుండలో ఉన్న చల్లని మంచి నీరు మాత్రమే తాగాలి 

సున్నిపిండి తో పాటు కొన్ని  ఆయుర్వేద మూలికల చూర్ణంతో స్నానం చేస్తే శరీరానికి ఆరోగ్యమే కాకుండా ఉత్తేజంగా ఉంటారు. 

జోజోబా ఆయిల్ లో ఉండే వివిధ ఔషదాలు చర్మం ఎరుపు, చికాకును లేకుండా చేస్తుంది