వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ మొదటిసారి తెలుగులో నేరుగా నటించిన చిత్రం సార్. ఇప్పుడు సార్ రివ్యూ తెలుసుకుందాం

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు(ధనుష్)..ఓ ప్రభుత్వ కాలేజీలో లెక్కల మాస్టర్. 

ప్రతి విద్యార్థికి సరైన విద్య అందాలి అన్నది బాలగంగాధర్ తిలక్ ఆశయం. 

కానీ..,  ప్రైవేటికరణకు గురైన విద్యావ్యవస్థలో అది సాధ్యం కాదు. దీనిపై తిలక్ ఎలా పోరాడాడు అన్నదే చిత్ర కథ

కొత్త కథలను ఎంచుకోవడంలో ధనుష్ ఎప్పుడూ ముందుంటాడు. ధనుష్ లాంటి ఓ స్టార్ హీరో ఈ సినిమాకి ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం కథే. 

ఈరోజుల్లో చదువు సామాన్యుడికి భారం అయిపోయింది. ఇలాంటి పాయింట్ తో కథ రాసుకున్నప్పుడే వెంకీ సగం సక్సెస్ కొట్టేశాడు. 

ఇక అనుకున్న కథని వెంకీ అంతే స్థాయిలో తెరపై చూపించడం కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. 

ఇక నటుడిగా ఎప్పుడూ నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ధనుష్.. ఈసారి కూడా గొప్పగా నటించి సినిమాకి ప్రాణం పోశాడు. 

ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోవడం, సెకండ్ ఆఫ్ లో హీరో క్యారెక్టర్ కు వెయిట్ పెరగడం, అవసరమైన ప్రతిచోటా సరైన ఎలివేషన్స్ పడటం సార్ మూవీకి ప్లస్ అయ్యింది.

 ఓవరాల్ గా "సార్" సినిమా కథలో ఉండే ఎమోషన్ మాత్రం ఆడియన్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. 

మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు తీసిన డైరెక్టర్ అంటూ.. వెంకీపై ఎవరికైనా చిన్నచూపు ఉంటే సార్ మూవీతో ఆ అభిప్రాయం పోవడం ఖాయం.

సంయుక్త మీనన్, సముద్రఖని సినిమాకి ప్లస్ అయ్యారు. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అంతా తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు.

జీవీ ప్రకాష్ మ్యూజిక్ సార్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. టెక్నీకల్ గా మిగతా విభాగాలు అన్నీ బాగానే పని చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా  తగ్గలేదు. 

ధనుష్ నటన, కథ,  డైలాగ్స్, మ్యూజిక్,  డైరక్షన్ ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్స్. 

కాస్త స్లో నేరేషన్, లెన్తీ డ్రామా, స్క్రీన్ ప్లే లో తడబడటం మైనస్ 

 ఓవరాల్ గా "సార్".. గొప్ప సినిమా కాకపోయినా.. మంచి సినిమా.