అంతేకాదు ఆయుష్షును తగ్గించే అతి నిద్రలేమి సమస్యను (స్లీప్ ఆప్నియా) తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.
గుండె వైఫల్యాలను నయం చేసే ఈ కొత్త మందును ఆక్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.
ఈ మాత్ర గుండెకు బ్లడ్ పంపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆయుష్షును తగ్గించే అతిలేమి నిద్ర సమస్యను నిరోధించడంలో తోడ్పడుతుంది.
జంతువులపై ప్రయోగాలు జరపగా సానుకూల ఫలితాలు వెలువడ్డాయనని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన వైపాప టౌమాట రావు వెల్లడించారు.
గుండె వైఫల్యం చెందిన విషయం నిర్ధారణ అయిన 5 ఏళ్లకే చాలా మంది చనిపోతున్నారు.
ఒక మనిషికి గుండె ఆగిపోవడం జరిగితే ఆ గుండెకు రక్తాన్ని పంపింగ్ ప్రక్రియ వంటి ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ ను ఉత్తేజపరిచడం కోసం సింపథెటిక్ సిస్టమ్ చేత మెదడు యాక్టివేట్ చేయబడుతుంది.
ఈ మాత్రకు గుండె వైఫ్యల్యాలను నిరోధించే శక్తి కలిగి ఉందని ప్రొఫెసర్ పఠాన్ వెల్లడించారు.
న్యూజిలాండ్ లోని గుండె జబ్బులు ఉన్న 2 లక్షల మందికి మంచి ఫలితాలు ఇస్తాయని.. వారి ఆయువుని పెంచుతాయని అన్నారు.
ఈ ఏఎఫ్-130 ఔషధం త్వరలోనే ఎఫ్డీఏ ఆమోదం పొందబోతుందని పరిశోధకులు తెలిపారు.
వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ఈ మాత్ర మనుషులపై ట్రయల్స్ వేసేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రొఫెసర్ పఠాన్ అన్నారు.