ప్రముఖ సింగర్‌ వాణీ జయరాం కన్నుమూశారు.

77 ఏళ్ల వయసులో చెన్నైలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు.

ఆమె ఎలా మరణించారన్న దానిపై క్లారిటీ లేదు.

ఆమె నుదురుపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గాయాలు ఎలా అయ్యాయన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక, వాణీ జయరాం తమిళనాడులోని వేళ్లూర్‌లో పుట్టారు.

వాణీ జయరాం అసలు పేరు కళైవాణి. తర్వాత వాణీగా పేరు మార్చబడింది.

ఆమె 1971లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు.

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అద్భుతమైన పాటలు పాడారు.

ఆ జీవిత కాలంలో మొత్తం 10వేలకుపైగా పాటలు పాడారు.

ఆమెకు 1969లో జయరామ్‌ అనే వ్యక్తితో పెళ్లయింది.