టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరు సునీత. ఆమె పాటతో ఎన్నో హావభావాలు పలికిస్తుంటారు. వాయిస్‌తో మెస్మరైజ్ చేస్తుంటారు.
ఈ వేళలలో నీవు అంటూ గులాబీ సినిమాతో పరిచయమైన ఆమె.. ఇటీవల వచ్చిన సీతారామంలో కన్నుల ముందే నీ కలలే అంటూ విరహ గీతాన్ని ఆలపించారు.
ఆమె వాయిస్‌లానే ఆమె మాటలు కూడా తియ్యగా ఉంటాయి. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు
టాలీవుడ్‌లోని మ్యూజిక్ డైరెక్టరందరి దగ్గర ఆమె పాడారు.
ఆమె సింగరే కాదూ..పలువురి హీరోయిన్లకు తన గాత్రాన్ని దానం (వాయిస్ ఓవర్) కూడా చేశారు.
అయితే సునీత వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె.. ఇద్దర పిల్లల పోషణ ఆమె చూసుకున్నారు.
2021లో ఆమె వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు
ఇప్పుడు ఆమె తన మనసు గుబులుగా. గుండె బరువుగా ఉందని ఓ వీడియోలో పేర్కొన్నారు.
అయితే ఆమె ఓ సినిమా చూసి ఇలా ఎమోషనల్ అయ్యారు.
తనకు సింగర్‌గా అవకాశం ఇచ్చిన క్రియేటర్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రంగ మార్తాండ
ఈ సినిమా ప్రివ్యూ షోను ఇటీవల ప్రదర్శించగా.. సినీ ప్రముఖులంతా వీక్షించారు. వీరిలో సునీత కూడా ఉన్నారు
ఈ సినిమాను చూసి ఆమె.. ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు.
ఒక సినిమాలో ఒక మూడు క్యారెక్టర్స్.. ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వారి నటనతో ఎంతో ఆకట్టుకున్నారు
ఈ సినిమా చూశాక గుండె అంత బరువైపోయింది. మనసంత గుబులుగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్‌గా అయితే బయటపడేందుకు అనేక మార్గాలు వెతుకుతుంటాం.
కానీ నా స్టిట్యుయేషన్ ఏంటో తెలుసా.. ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటేనే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. అలాగే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది.
అలాంటి గొప్ప పెర్ఫామెన్స్ ఆర్టిస్టుల నుంచి రాబట్టుకోవడం డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. హేట్సాప్.
స్ట్రాంగ్లీ రికమెండ్. కచ్చితంగా ఈ సినిమాను చూడండి. ఈ సినిమా మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉన్నాయి
రంగ మార్తాండ సినిమాను తప్పకుండా చూడాలని ఆ వీడియో ద్వారా చెప్పారు.