సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకోడానికి ఇష్టపడరు.

చాలా కొద్ది మంది నటీ, నటుల మాత్రమే తమ పర్సనల్ విషయాలను ఇతరులతో, అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇక ఈ మధ్య కాలంలో అయితే కొంత మంది సెలబ్రిటీలు తమకు పెళ్లి జరిగిన విషయాలను కూడా దాచిపెడుతున్నారు.

ఇటీవలే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పెళ్లి జరిగిన కొన్ని రోజులకు తనకు వివాహం జరిగింది అని వెల్లడించి అందరిని షాక్ కు గురించేసింది.

తాజాగా ఓ స్టార్ సింగర్ సైతం ఇలాంటి షాకే ఇచ్చాడు అభిమానులకు. ఓ నటిని నెల క్రితమే వివాహం చేసుకున్నాను అని తాజాగా వెల్లడించాడు.

నటి సమోనికా శ్రీవాత్సవను ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాను అని వెల్లడించాడు స్టార్ సింగర్ హర్షిత్ సక్సేనా.

పెళ్లికి రెండు రోజుల ముందే మా నిశ్చితార్థం జరిగిందని, తర్వాత అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో మా వివాహం ఛత్తీస్ ఘడ్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఫిబ్రవరి 9న జరిగింది అని హర్షిత్ చెప్పుకొచ్చాడు.

అయితే పెళ్లి విషయాన్ని దాచడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు ఈ సింగర్.

వరుసగా తనకు సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉండటంతో, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు హర్షిత్.

ఫ్రెండ్స్ కోసం మాత్రం రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని హర్షిత్ సక్సేనా అన్నాడు.

తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడిందో కూడా ఈ సింగర్ చెప్పుకొచ్చాడు. ఇక నేను, సమోనికా ఫస్ట్ టైమ్ ముంబైలో కలిశాం.

అప్పటి నుంచి మా మధ్య పరిచయం పెరిగింది. అయితే మా పరిచయాన్ని మా ఇంట్లోవాళ్లు ప్రేమగా భావించారు.

దాంతో సమోనికా అమ్మ మా తల్లిదండ్రులతో మాట్లాడటంతో మా వివాహనికి  అడుగులు పడ్డాయి అని ఈ స్టార్ సింగర్ చెప్పుకొచ్చాడు.