భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి నేడు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎత్తైన భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనుంది.

ఏడేళ్ల క్రితం అనగా.. 2016లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్‌ 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అన్న మాట ప్రకారం హైదరాబాద్‌, హుస్సెన్‌ సాగర తీరాన 125 అడుగులు ఎత్తైన అంబెద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో దాదాపు 11.80 ఎకరాల స్థలంలో విగ్రహం నిర్మాణం చేపట్టారు.

ఈ భారీ అంబేద్కర్‌ విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.

ఈ విగ్రహం నిర్మించిన పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు ఉంది. మెుత్తంగా భూమి నుంచి లెక్కిస్తే.. విగ్రహం ఎత్తు 175 అడుగులు.

కేసీఆర్‌ సూచనల మేరకు ఈ విగ్రహాన్ని పార్లమెట్‌ భవనంలో నమూనాలో ఏర్పాటు చేశారు.

పార్లమెంట్ ఆకారంలో రెండు ఎకరాల్లో పీఠం నిర్మాణం చేపట్టారు. దీనిలోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది.

పీఠం లోపల ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేద్కర్‌ జీవితలంఓని ముఖ్య ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు.

ఈ భవనం లోపల ఆడియో విజువల్‌ రూమ్స్‌, లైబ్రరీ, 2.93 ఎకరాల్లో థీమ్ పార్కుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇవే కాక రాక్‌గార్డెన్‌, , వాటర్‌ ఫౌంటేన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌శాండ్‌ స్టోన్‌ వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఇక స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపేలా పార్కింగ్‌ ప్లేస్‌ ఉంది.

రూ.146.50 కోట్ల అంచనా వ్యయంతో విగ్రహ నిర్మాణం చేపట్టారు.

దీని బరువు 465 టన్నులు ఉంటుంది. విగ్రహం కోసం 96 టన్నుల ఇత్తడి, 791 టన్నుల స్టీల్ వాడారు.

 ఇక విగ్రహ నిర్మాణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు.

అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు.

విగ్రహం నిర్మాణం కోసం ప్రతి రోజు 425 మంది కూలీలు పనిచేశారు.

విగ్రహ శిల్పి.. మహారాష్ట్రలోని ధూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన రామ్ వి సుతార్.

గుజరాత్‌లోని నర్మదా నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించింది కూడా ఈయనే.

 రామ్ వి సుతార్, ఆయన కొడుకు అనిల్ సుతార్ ఈ భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని డిజైన్ చేశారు.

2016 ఏప్రిల్ 14న ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఏడేళ్ల తర్వాత విగ్రహం ప్రారంభం అయ్యింది.

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం తెలంగాణ సర్కార్‌  రూ.10 కోట్లు విడుదల చేసింది.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌ను ఆహ్వానించారు.

విగ్రహం మెడలో వేయడం కోసం గులాబీ, చామంతి, తమలపాకులతో 125 అడుగుల గజ మాలను తయారు చేశారు.

హెలికాప్టర్‌ ద్వారా విగ్రహం మీద పూల వర్షం కురిపించారు.