ఈ రోజుల్లో చాలామంది పక్కనున్న మనిషిని పట్టించుకోకుండా మొబైల్ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు.
సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో సమయం తెలియకుండా గంటలు గంటలు అందులోనే గడిపేస్తున్నారు.
మరి కొంతమంది మాత్రం సమయాన్ని మరిచిపోయి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. ప్రేమలో ఉన్న యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇలా ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే జర్మల్ ఆఫ్ కాస్మోటాలజీ ఆండ్ ట్రైకాలజీలో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం.. మరికొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని తెలియజేస్తుంది.
అసలు ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడితే వచ్చే అనారోగ్య సమస్య ఏంటి? అధ్యాయనంలో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
చాలా సేపు సెల్ ఫోన్ లో మాట్లాడినా, గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చున్నా, ఎక్కువసేపు టీవీ చూసినా.. జుట్టు ఊడిపోయే ప్రమాదం లేకపోలేదట.
ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా జుట్టు ఊడిపోయే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది.
జుట్టు సమస్యలే కాకుండా మరిన్ని అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం కూడా ఉందని ఆ అధ్యాయనంలో పేర్కొనబడింది.
ఇకనుంచైన ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడడం, టీవీ చూడడం వంటివి తక్కువ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.