స్మార్ట్ ఫోన్ అనేది మనిషి శరీరంలో ఒక అంతర్భాగంలా మారిపోయింది.
అవసరం లేకపోయినా ఫోన్ పట్టుకునే కూర్చుంటున్నారు.
వయసుతో సంబంధం లేకండా అంతా ఈ స్మార్ట్ ఫోన్ కి బానిసల్లా మారిపోతున్నారు.
సిగిరెట్, మద్యం ఎలా అయితే వ్యసనాలో.. అలాగే స్మార్ట్ ఫోన్ వాడకం కూడా ఒక వ్యసనంలా మారిపోయింది.
దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
వయసుతో సంబంధం లేకుండా పదేళ్లకే వెన్నునొప్పి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇలా రావడానికి ప్రధాన కారణం రోజులో 3 గంటల కంటే ఎక్కువగా మీరు స్మార్ట్ ఫోన్ ని వాడుతుండటమే.
యువత ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా వాడటం వల్ల.. నిద్రలేమి సమస్య, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కోపం, అసహనం వంటి ఎన్నో సమస్యలు స్మార్ట్ ఫోన్ యూజర్లను ఇబ్బంది పెడుతున్నాయి.
మానసికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మానసికంగా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతుంటారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల ఎదుట స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు.
పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.