"ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నారు పెద్దలు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి.
ఈక్రమంలోనే చాలా మందికి ఉదయాన్నే మెులకలు తినే అలవాటు ఉంటుంది.
ఇది చాలా మంచి అలవాటు. మెులకల్లో పుష్కలంగా విటమిన్లు, ఫైబర్లు ఉంటాయి.
పుష్కలంగా విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, ఫైబర్ లాంటివి ఉన్నాయని అతిగా తింటే మాత్రం నష్టం తప్పదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
మెులకెత్తిన పెసర్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో అవి జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది.
ఇలా ఎక్కువ సమయం పట్టడంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వృద్ధులు, పిల్లలతో పాటు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మెులకలు తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
పెసల్లను జీర్ణక్రీయ బలహీనంగా ఉన్న వారు, రుమటాయిడ్ అర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్న వారు తినడం అంత మంచిదికాదని వైద్యులు చెబుతున్నారు.