అల్లం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొడుతుందని మనకి తెలుసు.

ఉప్మా, పులిహోర వంటి అల్పాహారంలోనూ, కూరల్లోనూ అల్లం వాడుతుంటారు.

అల్లం శరీరంలో పైత్యాన్ని పోగొడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే అల్లం ఎక్కువ వినియోగిస్తుంటారు.

అయితే టీలో అల్లం వేసి తాగితే ఆరోగ్యం అనుకుంటే పొరపాటే. అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనాల మాట అలా ఉంచితే అనారోగ్య సమస్యలు కలుగుతాయట.

ఏదైనా మితంగా తీసుకుంటేనే అమృతం. అమితంగా తీసుకుంటే విషమవుతుందని పెద్దలు అన్నారు.

అల్లం టీ మంచిదే. అలా అని అదే పనిగా అస్తమానూ తాగితే సమస్యలు తప్పవంటున్నారు. 

అల్లం టీ ఎక్కువగా తాగితే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడం కోసం అల్లం టీ తాగుతారు. 

అల్లం ఉండే యాంటీ ప్లేట్ లెట్స్ రక్తస్రావానికి కారణమవుతాయి.

మోతాదుకు మించి అల్లం టీ తీసుకుంటే.. నీళ్ళ విరేచనాలు అవుతాయి. 

అల్లం టీ అతిగా తాగితే డయేరియా వచ్చే అవకాశం ఉంది.

జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అతిగా తీసుకుంటే జీర్ణక్రియ పాడవుతుంది. 

ఇది ఉదర సంబంధిత రోగాలకు దారి తీస్తుంది. 

అల్లంతో పాటు నల్ల మిరియాలు, లవంగాలు వంటివి తీసుకుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం టీ తాగితే ఈ సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.